ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ డీలర్ల ఆందోళన.. కమిషన్ చెల్లించాలని డిమాండ్ - విశాఖ జిల్లా అనకాపల్లి

విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేషన డీలర్లు ఆందోళన చేపట్టారు. కరోనా కష్ట కాలంలో పేదలకు రేషన్ సరకులు అందించిన తమకు.. కమిషన్ నగదు అందించాలని డిమాండ్ చేశారు.

vishaka district
రేషన్ డీలర్ల ఆందోళన.. కమిషన్ చెల్లించాలని డిమాండ్

By

Published : Jul 11, 2020, 4:49 PM IST

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవో సీతారామారావును కలిశారు రేషన్ డీలర్లు. ఇబ్బందులు వివరించి పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. ఆరు పర్యాయాలు ప్రజలకు ఉచితంగా రేషన్ సరుకులు అందజేసినా డీలర్లకు రావాల్సిన కమిషన్ నగదు ఇంకా రాలేదన్నారు.

తమ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సేవలు అందజేస్తున్న రేషన్ డీలర్లకు బీమా సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చిన్ని యాదవ్, ప్రవీణ్ కుమార్, కుమార్, పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details