ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వానికి రేషన్ డీలర్లు షాక్... నిలిచిన సరకుల పంపిణీ - ration dealers protest in ap

రాష్ట్రవ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ నిలిచిపోయింది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పంపిణీ ఆపివేస్తున్నట్లు రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం తెలిపింది.

ration dealers protest
ration dealers protest

By

Published : Jul 20, 2020, 11:52 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 8వ విడత రేషన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రేషన్‌ డీలర్ల మెరుపు సమ్మె చేపట్టారు. ప్రభుత్వం స్పందించే వరకు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల కార్డుదారులు రేషన్ దుకాణాలకు వచ్చి వెనుదిరుగుతున్నారు.

రేషన్ డీలర్లను కరోనా వారియర్స్‌గా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలని వారి సంఘం అధ్యక్షుడు మండాది వెంకట్రావు డిమాండ్ చేశారు. రేషన్ ఇచ్చే సమయంలో వేలిముద్ర నిబంధన ఎత్తివేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details