ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంద్ పాటించిన రేషన్ డీలర్లు... ఇబ్బందుల్లో కార్డుదారులు - చోడవరంలో రేషన్ డిపోల డీలర్లు బంద్

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో 183 రేషన్ డిపోల డీలర్లు బంద్ పాటించారు. డీలర్లు బంద్​ చేపట్టడంతో... ప్రభుత్వం ఇచ్చే సరుకులు అందక కార్డుదారులు ఇబ్బందులకు గురయ్యారు.

ration dealers bandh in chodavaram  at vishaka
బంద్ పాటించిన రేషన్ డిపోల డీలర్లు

By

Published : Jul 20, 2020, 12:49 PM IST



విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో 183 రేషన్ డిపోల డీలర్లు బంద్ పాటించారు. డీలర్లు బంద్​ చేపట్టడంతో ప్రభుత్వం ఉచితంగా అందించే నిత్యవసర వస్తువుల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. సరుకులు అందక కార్డుదారులు ఇబ్బందులకు గురయ్యారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని... శానిటేషన్ పరికరాలు ఇవ్వలేదని రేషన్ డిపోల సంఘ అధ్యక్షడు బైన ఈశ్వరరావు, కార్యదర్శి గూనురు శంకరరావు తెలిపారు. 5 నెలలుగా బకాయిలు చెల్లించలేదని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details