ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో రథసప్తమి వేడుకలు - ratha sapthami at visakha district updates

రథసప్తమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పూజలు నిర్వహించారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. విద్యార్థులు సూర్య నమస్కారాలు.. పారాయణాలు చేశారు.

ratha sapthami at visakha district
విశాఖజిల్లాలో రథసప్తమి వేడుకలు

By

Published : Feb 19, 2021, 12:23 PM IST

విశాఖ జిల్లాలో రథ సప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా సూర్య నమస్కార కార్యక్రమాన్ని నిర్వహించాయి. తితిదే రిజర్వేషన్ కౌంటర్​కు సమీపంలో వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సింహాద్రి అప్పన్న సన్నిధిలో...

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా రథ సప్తమి నిర్వహించారు. రాతి రథంపై స్వామి వారిని అధిష్టించి అభిషేకాలు, పారాయణాలు చేశారు. సూర్యనారాయణస్వామిని సూర్యప్రభ వాహనంపై తిరువిధుల్లో విహరింపజేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికి పోటెత్తారు. కోవిడ్ నిబంధనల కారణంగా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సింహాద్రి అప్పన్న వేద పాఠశాలలో విద్యార్థులు పారాయణం చేపట్టారు.

ఇదీ చూడండి:

తిరుమలేశునికి సప్త వాహన సేవలు... దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details