విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో ప్రభుత్వ భూ సేకర ణకోసం నిర్వహించిన గ్రామసభలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో 153 .11 ఎకరాలన సేకరించటానికి అనకాపల్లి ఆర్డీవో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో మెుత్తం 161 మంది రైతులుండగా వారిలో 130 మంది రైతులు భూములిచ్చేందుకు అంగీకార పత్రం ఇచ్చారని ఆర్డీవో గ్రామస్తులకు తెలిపారు. దింతో గ్రామసభలో వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామసభ నిర్వహించి భూసేకరణ చేపట్టాల్సి ఉండగా..మాకు తెలియకుండా అంగీకారపత్రాలు ఏవిధంగా తీసుకున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూసేకరణ కోసం నిర్వహించిన గ్రామసభలో రసాభాస
ప్రభుత్వం చేపట్టిన భూసేరణ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా కోడూరులో నిర్వహించిన గ్రామసభలో ఘర్షణ తలెత్తింది. తమకు సమాచారం ఇవ్వకుండానే.. అంగీకార పత్రాలు ఎలా తీసుకుంటారని రైతులు ఆందోళన చేపట్టారు.
గ్రామసభలో రసాభాస