ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరుదైన మీనం.... విశాఖ మన్యంలో లభ్యం! - విశాఖ మన్యంలో గోల్డెన్ ఫిష్ వార్తలు

జలపాతాల నుంచి వచ్చే నీళ్లలో పెరిగే అరుదైన చేప అది. సాధారణంగా ఉత్తర భారత దేశంలో గంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి ఈ జాతి చేపలు. అయితే ఇవి ప్రస్తుతం విశాఖ మన్యంలోనూ పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఏయూకు చెందిన పరిశోధన విద్యార్థి గుర్తించాడు.

golden fish
golden fish

By

Published : Sep 17, 2020, 7:55 PM IST

golden fish

అంతరించిపోతున్న మత్స్యసంపదలో ఒకటైన గోల్డెన్ మార్షిస్ చేప విశాఖ జిల్లా మన్యంలో పెరుగుతోంది. సాధారణంగా ఈ రకం చేపలు ఉత్తర భారత దేశంలోని గంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. అయితే ఇవి తొలిసారిగా పాడేరు, అరకులోని జలపాతాల్లో పెరుగుతున్నట్లు ఆంధ్ర విశ్వ విద్యాలయ విద్యార్థి డేవిడ్ గుర్తించాడు. జువాలజీ విభాగానికి చెందిన ఇతను... ఆచార్య బాబు నేతృత్వంలో మూడేళ్లుగా ఈ చేపపై పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధన కోసం విశాఖ గిరిజన ప్రాంతాలలో ఎక్కువ కాలం గడిపాడు ఈ విద్యార్థి.

అంతరించిపోతున్న చేపలలో గోల్డెన్ మార్షిస్ ఒకటి. ఈ చేపలో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మొత్తం 17 రకాలుగా విస్తరించి ఉంటాయి. సాధారణంగా ఇవి ఉత్తర భారత దేశంలో గంగ పరివాహక ప్రాంతాల్లో లభ్యమవుతుంటాయి. కానీ తొలిసారిగా పాడేరు ,అరకు జలపాతాల ప్రవాహాల్లో ఇవి కనిపించడం విశేషం. ఈ చేపను స్పోర్ట్ ఫిష్​గా కూడా విదేశాల్లో పిలుస్తారు. వేగంగా సంచరించడం ఈ గోల్డెన్ మార్షిస్ చేప విశేషాలు - డేవిడ్, పరిశోధన విద్యార్థి, ఆంధ్ర విశ్వ విద్యాలయం

ABOUT THE AUTHOR

...view details