ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలోని ఓ రైతు ఇంట్లో అరుదైన ములుగు పిల్లి

విశాఖ మన్యంలో అరుదైన జంతువులు ఎన్నో ఉన్నాయి. పెరుగుతున్న జనసాంద్రత వల్ల అవి అంతరించిపోతున్నాయి. అందులో ములుగు పిల్లి ఒకటి. అయితే పాడేరు మండలం వంటల మామిడిలోని ఓ రైతు ఇంట్లో ములుగు పిల్లి పిల్ల ఉంది. ఆ రైతు వీటిని ఎంతో ప్రేమగా పెంచుతున్నాడు.

rare cat in visakha dst agency area
rare cat in visakha dst agency area

By

Published : Aug 30, 2020, 7:31 PM IST

విశాఖ మన్యం కొండ ప్రాంతాల్లో వివిధ రకాల జంతు సంపద ఉండేది. అయితే పెరుగుతున్న జనసాంద్రత.. పోడు వ్యవసాయం వల్ల జంతుజీవం అంతరించిపోతోంది. మన్యంలో అరుదుగా కనిపించే ఓ ములుగు పిల్లి జాతి ఉంది. రాత్రులు తప్ప పగలు అసలు ఎవరి కంటికీ కనిపించదు. మన్యం మారుమూల పాడేరు మండలం వంటల మామిడిలో ఓ రైతు పొలంలో ములుగు పిల్లి పిల్లను వదిలి వెళ్ళిపోయింది. చిన్నపిల్లగా ఉండడంతో ఆ రైతు దానిని చేరదీశాడు. ఇంటిలో ఆవాసం ఏర్పాటు చేసి పెంచుతున్నాడు. ఇప్పటికే నాలుగు నెలలు అయింది. ప్రతిరోజు ఇంట్లో అందరి ముందు తన ఆవాసంలో కలియ తిరుగుతూ ఆనందాన్ని కలిగిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details