ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం - rape news in viskaha tribals

విశాఖ మన్యంలో గిరిజన బాలికపై బంధవీధి గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 27 న జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

rape on minor girl in visakha dst tribal area
rape on minor girl in visakha dst tribal area

By

Published : Jun 30, 2020, 6:48 PM IST

విశాఖ మన్యంలో గిరిజన బాలికపై అత్యాచారం జరిగింది. ఈనెల 27 న జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జి.మాడుగుల మండలం జన్నేరులోని తమ ఇంటిలో ఉన్న 15 ఏళ్ల గిరిజన బాలికపై... బంధవీధి గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు.

బాలిక అరుపులు విని చుట్టు పక్కలవారు వచ్చేసరికి కుమార్ పరారయ్యాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు జి.మాడుగుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details