ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యాచార ఘటనపై విచారణ..ముగ్గురిపై కేసు నమోదు - rape case investigation

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో పదిహేనేళ్ల బాలిక అత్యాచారానికి గురైన ఘటనపై అనకాపల్లి డీఎస్పీ విచారణ చేపట్టారు. ముగ్గురు నిందితులను గుర్తించి వారిపై దిశ, ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు.

అత్యాచార ఘటనపై డీఎస్పీ విచారణ
అత్యాచార ఘటనపై డీఎస్పీ విచారణ

By

Published : Jul 7, 2020, 10:30 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో పదిహేనేళ్ల బాలిక అత్యాచారానికి గురైన ఘటనపై అనకాపల్లి డీఎస్పీ విచారణ చేపట్టారు. మెుత్తం ముగ్గురు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తితో పాటు మరో ఇద్దరు తనపై ఏడాదిగా అత్యాచారం చేస్తూ వచ్చారని బాధితురాలు పోలీసులకు వివరించింది. బాలిక ఆరు నెలల గర్భవతి కావటంతో ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. దిశ, ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details