ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన విశాఖ జిల్లా మునగపాకలో జరిగింది. గ్రామానికి చెందిన ఎం.అప్పారావు (26)... తన ఇంటి సమీపంలో ఆటలాడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అప్పటివరకు పిల్లలందరితో ఆటలాడుకుంటున్న పాప కనిపించకపోయేసరికి.. తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు గాలించారు. ఈలోగా కామాంధుని పైశాచికానికి చిన్నారి కేకలు పెట్టింది. గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు అప్పారావును చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై అత్యాచారయత్నం
మునగపాకలో ఐదేళ్ల చిన్నారిపై అప్పారావు అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు పోలీసులకు విషయాన్ని చేరవేశారు. నిందితుడిపై కేసు నమోదైంది.
చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై అత్యాచారయత్నం