ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం: వంటచెరుకు కోసం తీసుకెళ్లి.. కూతురు వరసయ్యే బాలికపై.. - అన్నవరంలో బాలికపై అత్యాచార

మానవత్వం మంట కలిసి పోతుందని ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. ఆ బాలిక ఆ వ్యక్తికి కూతురు వరుసవుతుంది. భర్త చనిపోవడంతో ఆ బాలిక తల్లి ఆ వ్యక్తిని వివాహం చేసుకుంది. కన్నతండ్రి స్థానంలో ఉన్న అతను బాలికను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి లైంగిక దాడి చేశాడు. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.

rape attemppt on daughter relation girl in vishakhapatnam
rape attemppt on daughter relation girl in vishakhapatnam

By

Published : Aug 28, 2021, 12:47 AM IST

Updated : Aug 28, 2021, 6:50 AM IST

కన్న తండ్రి స్థానంలో ఉండి కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని కూతురు వరుసయ్యే పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వంటచెరుకు కోసం తీసుకెళ్లి...

విశాఖ జిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన కొర్రా ఇజ్రాయిల్ అనే వ్యక్తి ఓ గిరిజన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు గతంలోనే వివాహం కాగా భర్త చనిపోయాడు. పదేళ్ల వయసున్న కుమార్తె ఉంది. తల్లి లేని సమయంలో ఇజ్రాయిల్.. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వంటచెరుకు కోసమని తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:couple death case: 'భార్యను హత్య చేసి.. భర్త ఉరివేసుకున్నట్టు భావిస్తున్నాం'

Last Updated : Aug 28, 2021, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details