దేశవ్యాప్తంగా 218, విదేశాల్లో 33 కేంద్రాల ద్వారా పలు సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రామకృష్ణ మిషన్ ఉపన్యాసకుడు స్వామి ఆత్మవిదానంద తెలిపారు. విశాఖలోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ్‌బంగ- బేలూరు మఠంలో ఈనెల 7న రామకృష్ణ మిషన్ వార్షిక సాధారణ సమావేశం నిర్వహించినట్లు ఆత్మవిదానంద తెలిపారు. ఏడాది కాలంలో.. విద్య, కరోనా మహమ్మారి నియంత్రణ సేవలు, గిరిజన సంక్షేమం, వైద్య సేవల కోసం మొత్తం రూ.867.78 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. చెన్నైలోని విద్యార్థుల హోమ్‌లో.. కంప్యూటర్, ఇంజినీరింగ్ విద్యలో శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభించినట్టు వివరించారు.
విదేశాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణకు రామకృష్ణ మిషన్ శ్రీకారం - రామకృష్ణ మిషన్ ఉపన్యాసకుడు స్వామి ఆత్మ విదానంద
దేశవిదేశాల్లో పలు సమాజ సేవా కార్యక్రమాల నిర్వహణకు రామకృష్ణ మిషన్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రామకృష్ణ మిషన్ ఉపన్యాసకుడు స్వామి ఆత్మవిదానంద తెలిపారు.
దేశవిదేశాల్లో సేవా కార్యక్రమాలు