ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంజాన్ మాసం ప్రార్థనలతో కిక్కిరిసిన మసీదులు

రంజాన్ మాసం ప్రార్థనలతో అనకాపల్లి, కశీంకోట మసీదుల్లో సందడి నెలకొంది. ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ముస్లిం సోదరులు రోజంతా ఉపవాస దీక్షలు చేస్తూ.. సాయంత్రం నమాజ్ కోసం ప్రార్థనా మందిరాలకు చేరుకుంటున్నారు.

'రంజాన్ మాసం ప్రార్థనలతో కిక్కిరిసిపోతున్న మసీదులు'

By

Published : Jun 1, 2019, 9:27 PM IST

'రంజాన్ మాసం ప్రార్థనలతో కిక్కిరిసిపోతున్న మసీదులు'

రంజాన్ మాసం సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లి, కశింకోట మసీదుల్లో సందడి వాతావరణం నెలకొంది. రోజంతా ఉపవాసం చేసి సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలతో ఇఫ్తార్ విందు చేస్తున్నారు. ముస్లిం సోదరులంతా ఒక చోట కూర్చొని విందు అనంతరం నమాజ్ చేస్తున్నారు. రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నియమ నిష్టలతో ప్రత్యేక ప్రార్థనతో పాటు నమాజు చేస్తారు. తెల్లవారుజామున నాలుగు నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఉపవాస దీక్ష చేపడతారు. అనంతరం ఇఫ్తార్ విందు ఆరగిస్తారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details