విశాఖ జిల్లా అనకాపల్లిలోని లెప్రసీ కాలనీలో.. రామచంద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. గతంలో లెప్రసీ సోకిన వారంతా ఒకే చోట ఉండేలా కాలనీ ఏర్పాటు చేశారు. వీరిలో పలువురు భిక్షాటనతో బతుకుతున్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ఉన్నందున కాలనీల నుంచి ఎవరు బయటకు రావడం లేదు. ఇలాంటి వీరికి రామచంద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఆహారాన్ని అందజేశారు. రైల్వేస్టేషన్ వద్ద అన్నా క్యాంటీన్ ముందు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి ,అనకాపల్లి పట్టణ సీఐ భాస్కర్ రావు పాల్గొన్నారు.
అనకాపల్లిలో రామచంద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ఆహార పంపిణీ - అనకాపల్లిలో కరోనా
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రావడంలేదు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని లెప్రసీ కాలనీలో రామచంద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ఆహారాన్ని అందిస్తోంది.
![అనకాపల్లిలో రామచంద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ఆహార పంపిణీ Ramachandra Charitable Trust food distribution in Leprosy Colony at anakapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6637064-621-6637064-1585840506603.jpg)
అనకాపల్లిలో రామచంద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ఆహార పంపిణీ