రామదాసు.. బందీఖానాలో గోడలపై శ్రీరామా.. శ్రీరామా అని రాసి రాముడిని స్మరించుకున్నాడు. చత్తీస్‌ఘడ్‌లోని ఓ తెగవారు.. తమ దేహాలపైనే.. రాముడిపేరుతో పచ్చబొట్టు పొడిపించుకుని.. రాముడి సేవలో పరితపిస్తుంటారు. వారి తెగ పేరు కూడా రామ్ నామి. రాముడంటే.. వారికి పిచ్చి.. అంతకంటే ఎక్కువ భక్తి.
చత్తీస్ఘడ్ జంజీర్చాప జిల్లాలో రామ్నామి తెగ వారికి ప్రత్యేకత ఉంది. అందరూ రామకోటి రాసి.. భక్తిని చాటుకుంటే.. రామ్నామి తెగవారు మాత్రం.. రామకోటికి తమ దేహాలనే అంకింతమిచ్చారు. వాళ్లు అలా రాసుకోవడానికి ఓ చరిత్ర ఉంది. ముత్తాతల కాలం నుంచి.. వీళ్లు రాముడికి పరమ భక్తులు.
పూర్వం వీరికి ఆలయాల్లో ప్రవేశం లేదు. అలా వీరి దేహాన్నే రాముడికి అంకితమిచ్చారు. శరీరంపై.. శ్రీరామ్ శ్రీరామ్ అని పచ్చబొట్లు వేసుకుని తమ భక్తిని చాటుకుంటున్నారు. ఒక పచ్చబొట్టు వేసుకుంటేనే.. ఎంతో బాధ. అలాంటిది వీరు మాత్రం దేహం మెుత్తం రామనామమే.. ఊహించుకోండి ఎంత కష్టమో.