వైకాపా పాలనలో ప్రజలు భయపడుతున్నారని ఎంపీ రామ్మోహన్నాయుడు విశాఖలో చెప్పారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నా... ప్రతిపక్ష నేత చంద్రబాబును గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే నగరాలు, గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు ఉన్మాదుల్లా మారారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెదేపా పునరావాస కేంద్రాల్లో ఉన్న 60 కుటుంబాలకు ఆహారం అందించేందుకు వెళ్తున్న తమ శ్రేణులను అడ్డుకొని... క్రూరత్వంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రామ్మోహన్నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరు.. ప్రజాస్వామ్యంలో చీకటి రోజును మిగిల్చిందన్నారు.
'ప్రజాస్వామ్యంలో ఇవాళ చీకటి రోజు' - Ram Mohan Naidu
ప్రజాస్వామ్యంలో ఇవాళ చీకటి రోజని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు అభిప్రాయపడ్డారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి ముందుగానే అనుమతులు తీసుకున్నా.. తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ram Mohan Naidu Criticize Jagan Government Over Attacks On TDP Cadre