ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖలో భారీ ర్యాలీ చేపట్టారు. మూడు రోజుల పాటు జరిగే జాతీయ సమ్మేళనంలో భాగంగా... అన్ని రంగాలకు చెందిన కార్మికులతో భారీగా ర్యాలీ నిర్వహించారు. డాబాగార్డెన్స్ సరస్వతీ పార్క్ వద్ద ప్రారంభమైన ర్యాలీ... పాత జైల్ రోడ్ సభా స్థలి వరకు సాగింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ నాయకులు ప్రసంగించారు. కార్మికులను, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి.
కార్మిక శక్తికి నిదర్శనంగా.. భారీ ర్యాలీ - ఏఐటీయూసీ
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో... వివిధ రంగాలకు చెందిన కార్మికులతో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ నాయకులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహిస్తోన్న భారీ ర్యాలీ