అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలు 300 రోజులకు చేరుకున్నాయి. వారికి సంఘీభావం ప్రకటిస్తూ విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెదేపా నాయకులు, రైతులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ నినాదాలు చేశారు. భూములిచ్చిన రైతుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి కోసం పాయకరావుపేటలో ర్యాలీ - పాయకరావుపేటలో అమరావతి ర్యాలీ వార్తలు
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెదేపా నేతలు, రైతులు ర్యాలీ చేపట్టారు. రాజధానికి భూములిచ్చిన అన్నదాతలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి కోసం పాయకరావుపేటలో ర్యాలీ