విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని గూడెం కొత్తవీధి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పిల్కు అనే వ్యక్తిని ఇన్‌ఫార్మర్‌గా ముద్ర వేసి హతమార్చిన ఘటనకు నిరసనగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిల్కును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాన వీధిలో మావోయిస్టుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ - vizag district crime news
మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని గూడెం కొత్తవీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మావోయిస్టుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ