'రక్షాబంధన్.. అత్మీయ అనురాగాల చిహ్నం' - visakhapatnam
బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొనగా రాఖీ పండుగ గురించి వివరించారు.

బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రక్షాబంధన్ వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. అక్క తమ్ముడు, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ ఆత్మీయ అనురాగాలకు చిహ్నంగా ఉంటాయని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. బ్రహ్మకుమారీస్ అక్కలు ఎంపీకి రక్షా బంధన్ కట్టి విశాఖ నగర ప్రజలను సుభిక్షంగా పరిపాలించాలని ఆకాంక్షించారు. విశాఖ ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. తాను సొంత లాభం కోసం రాజకీయాల్లోకి రాలేదని, తన పదవీకాలంలో విశాఖ ప్రజలకు తన వంతు సేవ చేసి తానేమిటో నిరూపించుకుంటానన్నారు. ఈ సందర్భంగా రక్షాబంధన్ గోడ పత్రికను ఆవిష్కరించారు. పాఠశాల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక నృత్యాలు అందరిని అలరించాయి.
ఇదీ చూడండి:విశాఖలో రక్తదాన శిబిరం
TAGGED:
visakhapatnam