విశాఖ జిల్లా అనకాపల్లిలో స్థిరపడిన రాజస్థాన్ వ్యాపారులు... లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అవసరమైన రక్షణ సామగ్రిని అందించారు. రాజస్థాన్ విష్ణు సేవా సంఘం ఆధ్వర్యంలో 60 వేల రూపాయల విలువ చేసే మాస్కులు, గ్లౌజులు,శానిటైజర్లు, హ్యాండ్ వాష్లను ఇచ్చారు. పోలీసుల సేవలు వెల కట్టలేనివని ప్రశంసించారు.
పోలీసులకు అండగా రాజస్థాన్ వ్యాపారులు - అనకాపల్లిలో కరోనా వార్తలు
కరోనా నియంత్రణలో పోలీసులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వారికి విశాఖ జిల్లా అనకాపల్లిలో స్థిరపడిన రాజస్థాన్ వ్యాపారులు అండగా నిలిచారు. 60 వేల రూపాయలు విలువ చేసే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు అందించారు.
పోలీసులకు సామాగ్రిని అందజేసిన రాజస్థాన్ వ్యాపారులు