విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరుపుతుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఉన్న పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను వెంటనే పరిశీలిస్తామని చెప్పారు.
'విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరం' - విశాఖ ఘటనపై మాట్లాడిన ఎంపీ భరత్
విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. తమ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో వెంటనే పరిశీలిస్తామని తెలిపారు.
విశాఖ ఘటనపై ఎంపీ మార్గాని భరత్ విచారం