విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరిలో రజకులు బల్లలు పండుగను ఎంతో సంప్రదాయంగా.. భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతిఏటా సంక్రాంతి తరువాత.. బల్లలు పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని రజకులు పేర్కొన్నారు. గ్రామంలోని రజకులంతా చాకిరేవు వద్దకు డప్పులతో చేరుకుంటారు. ఆ సమయంలో పెద్దలు, మహిళలు, యువత, పిల్లలు ఎంతో ఆనందంగా గడుపుతారని చెప్పారు.
అర్జునగిరిలో సంప్రదాయంగా రజకుల బల్లలు పండుగ - అర్జునగిరిలో రజకుల బల్లలు పండుగ న్యూస్
విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరిలో రజకులు బల్లలు పండుగను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ప్రతిఏటా సంక్రాంతి తరువాత నిర్వహించే ఈ పండుగను చిన్న, పెద్ద కలిసి భక్తి శ్రద్ధలతో రాతి బల్లలకు పూజలు నిర్వహించనున్నట్లు రజకులు పేర్కొన్నారు.
అర్జునగిరిలో సంప్రదాయంగా రజకుల బల్లలు పండుగ
దైవంగా భావించే రాతి బల్లలు, కులవృత్తి పరికరాలకు పసుపు, కుంకుమ, పళ్లు, పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తామని అన్నారు. సంప్రదాయంగా జరిగే ఈ పండుగతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని తెలిపారు.