ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైవాడ జలాశయం నుండి నీటి విడుదల.. ఆందోళనలో ముంపు బాధితులు - రైవాడ ప్రాజక్ట్

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలకు తోడు రైవాడ జలాశయం నుంచి నాలుగు వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు.

అచ్యుతాపురంలోని గ్రామాలు జలమయం.. ఆందోళనలో స్థానికులు
అచ్యుతాపురంలోని గ్రామాలు జలమయం.. ఆందోళనలో స్థానికులు

By

Published : Oct 13, 2020, 5:01 PM IST

ఎడతెరిపి లేని వర్షాలకు విశాఖ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. రైవాడ జలాశయం నుంచి నాలుగు వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు.

పునరావాస కేంద్రాలకు..

పెదపాడు, కాజీపాలెం, జగ్గన్నపేట గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గ్రామాలకు ఆనుకుని ఉన్న పురిటిగడ్డ, మెల్లిపాక గడ్డ, రోల్ గడ్డలు ఉగ్రరూపం దాల్చాయి. అచ్యుతాపురం తహసీల్దార్ నారాయణరావు, ఎలమంచిలి సర్కిల్ పోలీసులు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

ఆ వర్షాలకు తోడు..

మండలంలోని తిమ్మరాజుపేట, హరిపాలెం, అందలాపల్లి, కొండకర్ల, మల్లవరం ఉప్పవరం, ఎం. జగన్నాథపురం గ్రామాల్లో వరి, చెరుకు తోటలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలకు తోడు కొండకర్ల ఆవ నుంచి వచ్చే నీటికి తోడు కావడం వల్ల పంట పొలాలన్నీ నీట మునిగాయి.

అదే జరిగితే మరింత ముంపు..

వేలాది రూపాయలు అప్పులు చేసి నాటిన నారు కళ్ల ముందే ముంపునకు గురి కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెదపాడు కసింకోటని కలిపే రోడ్డు ముంపునకు గురై రాకపోకలు స్తంభించాయి. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైవాడ నుంచి మరింత నీటిని విడుదల చేస్తే ఈ మూడు గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లడం ఖాయమని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి :

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details