శిథిలావస్థ భవనంలో రైతు భరోసా కేంద్రం పెట్టేందుకు అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై విశాఖ జిల్లా పాయకరావుపేట గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పాయకరావుపేటలో శిథిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
శిథిల భవనంలో రైతు భరోసా కేంద్రం! - పాయకరావుపేటలో శిథిల భవనంలో రైతు భరోసా కేంద్రం వార్తలు
కూలేందుకు సిద్ధంగా ఉన్న శిథిల భవనంలో రైతు భరోసా కేంద్రం పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారంటూ.. విశాఖ జిల్లా పాయకరావుపేటలో గ్రామస్థులు ఆందోళన చేశారు.
![శిథిల భవనంలో రైతు భరోసా కేంద్రం! raithu bharosa centre in ruin building in paayakarao pet vizag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7365203-635-7365203-1590566189988.jpg)
శిథిల భవనంలో రైతు భరోసా కేంద్రం!
ఇక్కడ కేంద్రం పెడితే భవిష్యత్లో అది కూలిపోయే ప్రమాదం ఉందని రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ వద్దని.. మరో సురక్షిత భవనంలో రైతు భరోసా కేంద్రం పెట్టాలని కోరారు.
ఇవీ చదవండి... విమానాశ్రయంలో కొవిడ్-19 నియంత్రణ దిశగా పటిష్ఠ చర్యలు