అసలే చలి గాలులతో గజగజా వణికిపోతున్న విశాఖలో భారీ వర్షం కురిసింది. అక్కయ్యపాలెం, గురుద్వార, సీతమ్మధార, సత్యం జంక్షన్, బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో వర్షం పడింది. వర్షం ప్రభావంతో నగరంలో చల్లదనం మరింత పెరిగింది. ఒక్కసారిగా చినుకులు రావడంతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. వానతో రహదారులన్నీ జలమయమయ్యాయి. చలికి వణికిపోతున్న ప్రజలు... చినుకుల ప్రభావంతో బయటికి వచ్చేందుకే ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి:
విశాఖలో వర్షం.. ఇబ్బందిపడ్డ ప్రజలు - విశాఖలో వర్షం
విశాఖలో భారీ వర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో ఒకే సారి కురుసిన వాన కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చలితోపాటు ఇప్పుడు వర్షం కురవటంతో విశాఖ వాసులు మరింత వణికిపోతున్నారు.
విశాఖలో వర్షం.. ఇబ్బందిపడ్డ ప్రజలు