విశాఖ మన్యం పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేసవి ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పట్టణమంతా మబ్బులు కమ్మేశాయి. ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వర్షంతో వేసవితాపం నుంటి ప్రజలు ఉపశమనం పొందారు. గత మూడు రోజులుగా మన్యంలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు అత్యధికంగా నమోదయ్యాయి. వర్షం స్థానికుల్లో ఆహ్లాదాన్ని పంచింది.
పాడేరులో మబ్బులు...ఈదురుగాలులు.. చిరుజల్లులు - పాడేరు తాజా వార్తలు
పాడేరులో మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది. ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. మబ్బులతో చల్లటి గాలులు వీయడంతో ప్రజలు ఉపశమనం పొందారు.
![పాడేరులో మబ్బులు...ఈదురుగాలులు.. చిరుజల్లులు rain fall in paderu visakha dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7328115-594-7328115-1590318504008.jpg)
పాడేరులో మబ్బులు... ఈదురుగాలి.. చిరుజల్లులు