విశాఖ జిల్లా పాడేరు మన్యంలో ఎండా వానా దోబూచు లాడాయి. ఓ పక్కన వర్షం కురుస్తూనే మరో పక్కన ఎండ కాయడంతో ఈ దృశ్యం చూపరులకు కనువిందు చేసింది. కొండల వెంబడి దట్టమైన మేఘాలు కమ్మేసి వర్షం కురిసిన మధ్యలో సూర్యుడు కనిపిస్తూ.. భిన్న వాతావరణం దృశ్యం ఆవిష్కరించింది. ప్రకృతి ప్రేమికులు పాడేరు మన్యం ఆహ్వానిస్తోందంటూ..పరశించిపోయారు.
విశాఖ పాడేరు అందాలను చూద్దాము రారండి..! - rain and sun simultaneously came at paderu
ప్రేమించే కన్నులకు వాతవరణంలో వచ్చే ప్రతీ మార్పు అందంగా కనిపిస్తుంది. అలాంటిది ఓ పక్క వర్షం,మరో పక్క ఎండ జట్టుగా పెనవేసుకుని కనిపిస్తే..ప్రకృతి ప్రేమికులకు పండగే. ఈ ఉహను తలుచుకుంటేనే ఇంత బాగుంటే..! ఇక కన్నుల ముందు సాక్షాత్కరిస్తే, ఎంత బాగుంటుంది కదా..!మీరూ ఈ దృశ్యాన్ని చూడాలంటే, విశాఖపట్నం పాడేరుకు వెళ్ళాల్సిందే మరీ..!
![విశాఖ పాడేరు అందాలను చూద్దాము రారండి..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4719404-57-4719404-1570793067573.jpg)
ఓ పక్క వర్షం ..మరో పక్క ఎండ