ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టికెట్ రిఫండ్ కార్యాలయాలకు పెరిగిన రద్దీ - రిజర్వేషన్ రిఫండ్స్ కోసం వస్తున్న ప్రయాణికులు వార్తలు

గతంలోనే టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు.. రైళ్ల రద్దు కారణంగా అధికారులు టికెట్ డబ్బులను రిఫండ్ చేస్తున్నారు. రిఫండ్ డబ్బుల కోసం ప్రయాణికులు రిజర్వేషన్ కార్యాలయాలకు క్యూ కట్టారు.

railway passengers reservation tickets refunds in vizag
విశాఖపట్నం రైల్వే స్టేషన్

By

Published : Jun 10, 2020, 7:37 PM IST

ప్రయాణికుల రైళ్లు ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చేయకపోవడం వల్ల రిజర్వేషన్ చేసుకున్నవారికి నగదు తిరిగి ఇచ్చే ప్రక్రియను రైల్వే అధికారులు వేగవంతం చేశారు. మే 22వ తేదీ తర్వాత రైల్వే రిజర్వేషన్ కార్యాలయాలు తెరుచుకున్నప్పటి నుంచి.. అధికారులు రిఫండ్ చేస్తున్నారు.

టికెట్ డబ్బులు తిరిగి తీసుకునేందుకు వచ్చే వారితో విశాఖ రైల్వే రిజర్వేషన్ కార్యాలయాలు రద్దీగా మారుతున్నాయి. ఆన్​లైన్​లో రిజర్వేషన్ చేసుకున్న వారికి ఆన్​లైన్​లోనే నగదు చెల్లిస్తున్నారు. వాల్తేరు డివిజన్ పరిధిలో ఇప్పటివరకు సుమారు రూ. 3 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details