విశాఖలోని మాధవధారకు చెందిన సిరిపురపు పవన్ కుమార్ 2019 క్యాట్ పరీక్షలో 99.12 శాతం సాధించాడు. ప్రతిష్టాత్మక బెంగళూర్ ఐఐఎంలో సీటు సాధించాడు. కానీ రూ.4 లక్షల ఫీజు కట్టే ఆర్థిక స్థోమత తన కుటుంబానికి లేదు.. పవన్ తండ్రి రాంబాబు ఒక ఆటో డ్రైవర్. గతంలో.. పవన్ కుమార్ పదోతరగతి వరకు నవోదయలో చదివి 10/10 పాయింట్లు సాధించి.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్ తెచ్చుకున్నాడు.
ఐఐఎం డోనేషన్ కట్టేందుకు విద్యార్థికి దాతల సాయం - మాధవధారలో పవన్ కుమార్‌కు సాయం
విశాఖకు చెందిన ఓ విద్యార్థి క్యాట్ పరీక్షలో మెరుగైన మార్కులతో.. బెంగళూరు ఐఐఎంలో సీటు సాధించాడు. డోనేషన్ కట్టడానికి డబ్బులు లేకపోవడంతో..సామాజిక మాధ్యమాల్లో సాయం చేయాల్సిందిగా కోరాడు. స్పందించిన దాతలు.. 2 లక్షల 40 వేల రూపాయలు అందించారు.
విద్యార్థికి సాయం
ఇప్పుడు బెంగళూర్ ఐఐఎంలో సీట్ సాధించినా... ఫీజులు కట్టలేక సామాజిక మాధ్యమాల ద్వారా దాతల సహాయం అర్థించాడు. పవన్ కుమార్ అభ్యర్థనకు వివిధ సేవా సంస్థల దాతలు స్పందించి రూ. 2 లక్షల 40 వేలు అందించారు. విశాఖలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ శివ హర్ష.. ఈ నగదును పవన్‌కు అందజేశారు.
ఇదీ చూడండి.రైతు సంక్షేమానికి పెద్దపీట.. 8.16 శాతం వృద్ధి అంచనా..!