తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్, ప్రజా సంబంధాల అధికారి విజయ్ కుమార్ కోవిడ్ తో మరణించారు. కొద్ది రోజులుగా నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు.
వైరస్ తో పోరాడి.. ఇవాళ పరిస్థితి విషమించగా తుదిశ్వాస విడిచారు. డీఆర్ఎం కార్యాలయంలో కమర్షియల్ అధికారిగా ఏళ్లుగా ఆయన సేవలందించారు. విజయ్ కుమార్ మృతిపై రైల్వే అధికారులు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.