విశాఖ కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి కాలపరిమితి లేదు: రైల్వే బోర్డు
Railway Board Reply on Railway Zone: విశాఖ రైల్వే జోన్ పై సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన సమాచారానికి.. రైల్వే బోర్డు జవాబు ఇచ్చింది. కొత్త జోన్ ఏర్పాటు, నిర్వహణ, కార్యకలాపాలకు ఎలాంటి కాలపరిమితి లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
Railway Board Reply on Railway Zone: రైల్వే జోన్ ఏర్పాటుపై సమాచార హక్కు చట్టం కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారానికి రైల్వే బోర్డు జవాబు ఇచ్చింది. విశాఖ రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 170 కోట్లు కేటాయించినట్లు స్పష్టంచేసింది. 106 కోట్ల వ్యయంతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం 6 లక్షల రూపాయల వ్యయం అయ్యింది. రాయగడ రైల్వే డివిజన్ తూర్పు కోస్తా రైల్వేలో భాగంగానే ఉంటుందని స్పష్టంచేసింది. ప్రస్తుతం కాజీపేటను కొత్త డివిజన్ గా చేసే ప్రతిపాదన ఏదీ లేదని రైల్వే బోర్డు వెల్లడించింది.
ఇవీ చదవండి: