విశాఖలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో రైల్వే సిబ్బంది, అధికారులకు ఉచిత వైద్య సదుపాయం సక్రమంగా అందే విధంగా రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలని రైల్ మాజ్ధుర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చలసాని గాంధీ కోరారు.వాల్తేర్ డివిజన్ ప్రధాన రైల్వే ఆసుపత్రిలో చీఫ్ మేట్రాన్గా పని చేస్తున్నసత్యవతి, రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మల్లిఖార్జున రావు కరోన కారణంగా మృతి చెందడం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రైల్వే ఉద్యోగులు వైద్య సదుపాయం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే సరైన వైద్య సేవలు అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. రైల్వే జోనల్, డివిజనల్ అధికారులు ఈ పరిస్థితులపై స్పందించి కోవిడ్ సేవల సమన్వయం కోసం ప్రత్యేకంగా అధికారులను కేటాయించాలని గాంధీ వివరించారు.
రైల్వే సిబ్బంది, అధికారులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి - వాల్తేర్ డివిజన్లో కరోనాతో రైల్వేసిబ్బంది అవస్థలు
కోవిడ్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో రైల్వే సిబ్బంది, అధికారులకు ఉచిత వైద్య సదుపాయం సక్రమంగా అందే విధంగా రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలని రైల్ మాజ్ధుర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చలసాని గాంధీ కోరారు.
రైల్ మాజ్ధుర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చలసాని గాంధీ