విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. 'ప్రజలలో నాడు- ప్రజల కోసం నేడు' పేరిట సీఎం జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. చోడవరం మండలం ఖండేపల్లి, మైచర్లపాలెం, దామునాపల్లిలో పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే.. లక్ష్మీపురంలో ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ ఫలాలు ఏ విధంగా అందుతున్నాయన్న అంశంపై ఆరా తీశారు.
గ్రామాల్లో రచ్చబండ నిర్వహించిన ఎమ్మెల్యే ధర్మశ్రీ - రచ్చబండ నిర్వహించిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే ధర్మశ్రీ