విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మార్టూరు గ్రామంలో క్వారీ కార్మికుడు పాము కాటుకు గురై మృతి చెందాడు. పని కోసమని 2 నెలల క్రితం విశాఖ వచ్చిన వ్యక్తి శనివారం రాత్రి సమయంలో పాము కాటు వేసింది.
చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి విశాఖపట్నానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై అనకాపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.