విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం డి.అగ్రహారంలో లెక్కల వెంకట సత్యం, మాధవి దంపతులు వ్యవసాయ కూలీలు. వారికి ఏడేళ్ల బాబు, ఐదేళ్ల బాలిక ఉన్నారు. స్థానికంగా పాఠశాలలు లేకపోవడంతో ఏడేళ్ల కుమారుడు మనోజ్.. పశువుల కాపరిగా మారాడు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. కుమారుడు పశువులను కాసేందుకు వెళ్లాడు.
క్వారీ గుంత వద్దకు..
ఈ క్రమంలో ఆవులు మేతమేస్తూ క్వారీ గుంత వద్దకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మనోజ్.. ఆవుల కోసం వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు క్వారీ గుంత నీటిలో జారిపడి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు క్వారీ గుంతలో పడి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి : పెరుగుతున్న కడుపుకోతలు.. విశ్వాసాలే కారణమా?