విశాఖ మన్యంలో పాడేరు మినహా వేరేచోట క్వారంటైన్ సెంటర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజులుగా పాడేరులో పది మంది వరకు కొవిడ్ కారణంగా మృత్యువాతపడ్డారు. కరోనా పరీక్షల ఫలితాలు రావడానికి ఐదు రోజులు సమయం పడుతుండటం.. జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అధికారులు కొవిడ్ నియంత్రణకు వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పటికీ సరైన సదుపాయాలు లేక అంతంతమాత్రంగానే వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్సీల్లో క్వారంటైన్ సెంటర్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల పరికరాలు ఉన్నప్పటికీ.. వైద్యులు లేక నిరుపయోగంగా మారుతున్నాయి.
క్వారంటైన్ కేంద్రాలు లేక రోగుల అవస్థలు..