విశాఖ జిల్లా కండివరం గ్రామస్తులు రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామం చేరుకున్నారు. వీరు గ్రామంలో ఉండేందుకు గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చినా అధికారులకు సమాచారం ఇవ్వకుండా, క్వారంటైన్లో ఉండకుండా జనావాసంలో కలిసి ఉన్నారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గ్రామానికి చేరుకొని 8మందిని చోడవరంలోని క్వారంటైన్‌కు తరలించారు. వీరికి వైరస్ లక్షణాలు లేకపోయినా, ముందస్తు జాగ్రత్త చర్యగా క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
'హైదరాబాద్ నుంచి వచ్చారు..అయినా అధికారులకు సమాచారమివ్వలేదు' - చోడవరం క్వారంటైన్
వారంతా రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చారు. క్వారంటైన్లో ఉండకుండా... అధికారులకు సమాచారమివ్వకుండా గ్రామంలో తిరుగుతుండటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారందర్నీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన విశాఖ జిల్లా చోడవరంలో జరిగింది.
చోడవరంలో క్వారంటైన్ ఏర్పాటు
చోడవరంలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన అధికారులు... 10 మందికి సరిపడేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:కరోనా నియంత్రణకు సరికొత్త ఆలోచన !