ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిసెంబర్ నుంచి ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం...

ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం కార్యక్రమం డిసెంబర్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విశాఖ జిల్లా అధికారులు బియ్యం సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దే రేషన్ బియ్యు, సరకులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. నూకలు, రాళ్లు, రంగు బియ్యంలేని సార్ టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యం లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.

డిసెంబర్ నుంచి ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం... జిల్లా యంత్రాంగం సన్నాహాలు
డిసెంబర్ నుంచి ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం... జిల్లా యంత్రాంగం సన్నాహాలు

By

Published : Aug 20, 2020, 4:17 PM IST

నాణ్యమైన బియ్యం సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నుంచి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు విశాఖ జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. డిసెంబర్ నెల నుంచి ఇంటి వద్దకే వాలంటీర్లు రేషన్ బియ్యం తీసుకెళ్లి పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ఈ పథకం ఏప్రిల్ నుంచి జిల్లాలో అమలు కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. ఏప్రిల్ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రెండు సార్లు ఉచితంగా రేషన్ సరకులు ఇస్తున్నారు. ఈ పంపిణీ నవంబర్ వరకు కొనసాగనుంది. ఈ కారణంగా నాణ్యమైన బియ్యం సరఫరా డిసెంబర్ కు వాయిదా పడింది. జిల్లాల వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

సార్ టెక్స్ బియ్యం సరఫరా

విశాఖ జిల్లాకు సంబంధించి బియ్యం సరఫరాపై అధికారులు దృష్టిపెట్టారు. జిల్లా వ్యాప్తంగా 12.60 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి నెలకు సగటున 18 వేల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. డిసెంబర్ నుంచి గ్రామ, వార్డు సచివాలయం యూనిట్ గా బియ్యం సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సచివాలయానికి ఒకటి చొప్పున వాహనాన్ని కేటాయించనున్నారు. ప్రస్తుతం కార్డు దారులకు సరఫరా చేస్తున్న బియ్యంలో నూకలు, రాళ్లు రంగుమారిన బియ్యం తదితర లోపాలు 25% వరకు ఉంటున్నారు. ఇక నుంచి బియ్యాన్ని సార్ టెక్స్ యంత్రాల ద్వారా శుద్ధిచేసి పంపిణీచేయనున్నారు.

శ్రీకాకుళం, తూ. గో . జిల్లాలో నుంచి

తొలి విడతగా 5, 10, 15, 20 కిలోల చొప్పున ప్యాకెట్ల రూపంలో బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ జిల్లాకు జిల్లాలోని మిల్లులతో పాటు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నాణ్యమైన బియ్యం రానున్నాయి. డిసెంబర్ నుంచి నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జిల్లా పౌర శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి :పెట్టుబడిదారులకు అనువుగా నూతన పర్యటక పాలసీ: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details