pv sindhu visits simhachalam temple: విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను.. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. సింధుకు ఆలయాధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభానికి ఆలింగనం చేసుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తీర్థ ప్రసాదాలు అందించి.. వేదాశీర్వచనం చేశారు.
స్వామిని దర్శించుకోవడం తన అదృష్టమన్న సింధు.. ఆలయంలోని శిల్ప సంపదను చూసి ఆనందం వ్యక్తం చేశారు.