పుట్టగొడుగుల కూర తిని 9 మంది ఆస్పత్రి పాలైన ఘటన విశాఖ మన్యంలో చోటు చేసుకుంది. జీకే వీధి మండలం కొత్త వెదురుపల్లిలో కొందరు కొండ పైకి వెళ్లి.. పుట్టగొడుగులు తెచ్చుకుని కూర వండుకుని తిన్నారు. కొద్దిసేపటికే తొమ్మిది మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను 108 అంబులెన్స్ లో చింతపల్లి ఆసుపత్రికి తరలించారు.
పుట్టగొడుగుల కూర తిని 9 మందికి అస్వస్థత - కొత్త వెదురుపల్లి
విశాఖ మన్యం జీకే వీధి మండలం కొత్త వెదురుపల్లిలో పుట్టగొడుగుల కూర తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు.
'పుట్టగొడుగుల కూర తిని 9 మందికి అస్వస్థత'
ఇవి చదవండి...వేట కుక్కల దాడిలో జింక మృతి