ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి' - కంభంపాటి హరిబాబు

ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి డి. పురందేశ్వరి అన్నారు. విశాఖ జిల్లా భాజపా అభ్యర్థులకు బి-ఫారాలు అందించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

పురందేశ్వరికీ బి పారం అందజేస్తున్న హరిబాబు

By

Published : Mar 25, 2019, 7:06 AM IST

పురందేశ్వరికీ బి పారం అందజేస్తున్న హరిబాబు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరుఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు విశాఖ భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో బి-ఫారాలు అందించారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డి.పురందేశ్వరికి, ఎంపీ కంభంపాటి హరిబాబు బి-ఫారం అందించారు. విశాఖలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసిన ప్రజలు మళ్లీ ఆదరిస్తారని పురందేశ్వరి చెప్పారు. దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. ప్రతి ఓటు అభ్యర్థులకు కాదని..ప్రధాని మోదీకి వేసినట్లుగా భావించాలన్నారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details