విశాఖ భాజపా పార్లమెంట్ అభ్యర్ధిగా నియోజకవర్గ అభివృద్ధికి పలు హామీలు ప్రకటించారు... పురంధేశ్వరి. సాగర నగరంలో కాలుష్య తగ్గించడం, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలో ఉద్యోగ కల్పన అవకాశాలు కల్పించడంపై దృష్టి పెడతానన్నారు. విశాఖకు ఇతర నగరాలతో అనుసంధానం పెంచే విధంగా కృషి చేస్తానని చెప్పారు.
అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధికి కృషి చేస్తా! - భాజపా మేనిఫెస్టో
విశాఖ పార్లమెంట్ భాజపా అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి... నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేశారు. అన్ని రంగాల్లో నగర అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
విశాఖ పార్లమెంట్ భాజపా అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి