విశాఖ జిల్లా అనకాపల్లిలో దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో దివ్యాంగ మహిళపై దాడి చేసిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అతన్ని వికలాంగుల చట్టం 2016 సెక్షన్ 91, 92 ప్రకారం శిక్షించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక విశాఖ జిల్లా కార్యదర్శి నూక అప్పారావు పేర్కొన్నారు. మాస్కు పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై దాడి చేయటం అమానుషమని అన్నారు. అనంతరం అనకాపల్లి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
'దివ్యాంగ మహిళా ఉద్యోగిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి' - latest anakapalli news
నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిపై దాడి చేసిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. అనంతరం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు.. అనకాపల్లి ఆర్టీవోకు వినతి పత్రం అందజేశారు.
'దివ్యాంగ మహిళా ఉద్యోగి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'