విశాఖ జిల్లా అనకాపల్లిలో మరో 17 మందికి కరోనా సోకింది. వీరిలో సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉన్నారు. అనకాపల్లిలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో... ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలు ప్రచురించారు. వీటిని సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లకు పట్టణ సీఐ భాస్కర్ రావు అందజేశారు. వీరితో అనకాపల్లి పట్టణంలోని ఇంటింటికి కరపత్రాలు అందజేస్తామని సీఐ వెల్లడించారు.
కరోనాపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ - corona cases in vishaka anakapally
విశాఖ జిల్లా అనకాపల్లిలో మరో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే పట్టణంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో... ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేస్తున్నారు.
కరోనా జాగ్రత్తలు వివరిస్తూ కరపత్రాలు ప్రచురణ