ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలు, దళితులపై దాడులను నిరసిస్తూ సమావేశం... - విశాఖలో మహిళలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన

మహిళలపై దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర వైఫల్యం చెందాయని ప్రజా, హక్కుల సంఘాలు,వామపక్ష రాజకీయ పార్టీలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ దాడులను వ్యతిరేకిస్తూ ...సీపీఐ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

left wing political parties meeting
దాడులను నిరసిస్తూ సమావేశం

By

Published : Oct 10, 2020, 2:43 PM IST

మహిళలు, దళితులపై దాడులకు వ్యతిరేకంగా ప్రజా, హక్కుల సంఘాలు,వామపక్ష రాజకీయ పార్టీలు విశాఖ జిల్లా సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదని, వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నందుకు కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రానున్న కాలంలో వీటి నివారణకు పటిష్టమైన చట్టాలను అమలు చేసేందుకు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని కోరారు. దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 13వ తేదీన విశాఖలో ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించారు.

ABOUT THE AUTHOR

...view details