లాక్డౌన్తో నిరాశ్రయులైన కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. పెద్దబొడ్డేపల్లిలోని తెలంగాణకు చెందిన 47వలస కార్మికుల కుటుంబాలకు ఉమాశంకర్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ నిబంధనతో వీరంతా ఇక్కడ చిక్కుకుపోయారని, వీరి ఇబ్బందులను గమనించి ఈ సహాయం చేశామని ఆయన తెలిపారు.
తెలంగాణ వలస కూలీలకు నిత్యావసరాలు అందజేత - mla petla umashankar news
పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నారు. ఉపాధి పనులు లేక, చేతిలో డబ్బులేక, తినడానికి తిండిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ నుంచి విశాఖకు వలస వెళ్లిన కార్మికుల ఇబ్బందులు గుర్తించిన నర్సీపట్నం ఎమ్మెల్యే వీరికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
తెలంగాణ వలస కూలీలకు నిత్యావసరాల అందజేత