విశాఖ జిల్లా పాడేరు మండలం కుజ్జెలిలో రక్తహీనతతో మృతి చెందిన గ్రామ వాలంటీర్ అనురాధ కుటుంబానికి... జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ సూచన మేరకు... రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అందజేశారు. బాలింతగా ఉన్నప్పటికీ విధులు నిర్వహిస్తూ మృతిచెందడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వాలంటీర్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత - విశాఖపట్నం జిల్లా నేరాలు
విశాఖ జిల్లా కుజ్జెలిలో రెండు రోజుల క్రితం రక్తహీనతతో మృతి చెందిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి రూ.5లక్షలు ఆర్థిక సహాయాన్ని స్థానిక ఎమ్మెల్యే అందించారు.
![వాలంటీర్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత Providing financial support to the deceased volunteer family in paderu vizag district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7042787-125-7042787-1588505759954.jpg)
మృతిచెందిన వాలంటీర్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత