కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డుల కోసం చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారని.. పట్టించుకోవడంలేదని వాపోయారు. దీనివల్ల ఎన్నో రాయితీలను కోల్పోతున్నారని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో డప్పు కళాకారులు అందరికీ రూ.7500 ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.
'డప్పు కళాకారులకు రూ.7500 ఆర్థిక సాయం చేయాలి' - విశాఖ జిల్లా కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి
విశాఖ జిల్లాలో ఉన్న డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని... విశాఖ జిల్లా కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేసింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో డప్పు కళాకారులు అందరికీ రూ.7500 ఆర్థిక సహాయం పంపిణీ చేయాలని కోరారు.
డప్పు కళాకారులకి ప్రభుత్వం రూ. 7500 ఆర్దిక సాయం చేయాలి