విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద అఖిలపక్ష కార్మిక, కర్షక సమితి చేపట్టిన నిరసన దీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నిరసన చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భాజపా ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు.
నిర్విరామంగా కొనసాగుతున్న అఖిలపక్ష కార్మిక, కర్షక సమితి నిరసనలు - All party leaders protest at Visakhapatnam GVMC
విశాఖ జీవీఎంసీ వద్ద అఖిలపక్ష కార్మిక, కర్షక సమితి చేపట్టిన నిరసన దీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అఖిల పక్ష కార్మిక, కర్షక సమితి నిరసనలు
సీఐటియూ నాయకులు కుమార్, ఐకాస ఛైర్శన్ జగ్గునాయుడు నేతృత్వంలో కార్మికులు నిరసన దీక్షలు సాగిస్తున్నారు. కేంద్ర నిర్ణయం ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదని నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ..Cji NV Ramana: శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ